రెండు కోట్ల రూపాయల ఆఫర్ వదులుకుందట సాయిపల్లవి.అది ఒక ఫేస్ క్రీం యాడ్.ఆ యాడ్ గనుక వచ్చిఉంటే జనాలకు తన పై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని పైగా అలాంటి ఫేస్ క్రీమ్ తాను అసలు వాడనుఅని దాదాపు సినిమాల్లో కూడా మేకప్ లేకుండా ఉన్న కొద్దిపాటి మేకప్ తో కనబడే తాను ఈ యాడ్ చేయలేనని చెప్పేసింది.ఇప్పటికే ఈ యాడ్ పేరు మోసిన హీరోయిన్లు నటించేందుకు ఆసక్తి చూపించారట.ఎంత డబ్బు వచ్చినా తన మనస్సుకి వ్యతిరేకమైన పనిచేయనని తిరస్కరించిన సాయిపల్లవి నిజంగానే సింగిల్ పీస్ అని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Leave a comment