ఎన్నో రంగుల్లో గోళ్ళ రంగు సీసాలు ఇంట్లో పేరుస్తూ ఉంటారు. మ్యాచింగ్ కోసం తప్పుదు మరీ .కొంచెం వాడే సరికి నచ్చకుండా పోతుంది. వీటిని ఇంట్లో వస్తువులకు అలంకరణ కోసం ఉపయోగించవచ్చు .పూల కుండీలపై చక్కని డిజైన్లు వేయవచ్చు. టూవీలర్స్ ట్రాఫిక్లో వెళ్ళేప్పుడు గీతలు పడతాయి. ఆ ఫ్యాబ్ సరైన గోళ్ళ రంగు ఎంచుకొని మరక కనబడకుండా చేయవచ్చు. రంగురాళ్ళ నగలు ఫ్యాషన్ కోసం కొంటుంటారు ఒక్కసారి వేసుకోగానే రాళ్ళు ఊడి వస్తాయి. ఆ ఊడిపోయిన రాళ్ళు ఈ గోళ్ళరంగుతో అంటించవచ్చు. తాళాల గుత్తులు ఒక్కసారి ఎంత వెతికినా కనిపించవు. అలాంటప్పుడు ఈ రంగులతో వాటిని నింపండి .ఎక్కుడ పెట్టిన వెంటనే కళ్ళను ఆకర్షిస్తాయి.

Leave a comment