క్రమం తప్పని పవర్ వాక్ తో లివర్, కిడ్నీల వంటి శరీర భాగాల వద్ద కొవ్వు కరిగిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు. ప్రతి రోజు క్రమం తప్పకుండా నడుస్తూ వుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిసిన విషయమే. అయితే ఎంత వేగంగా నడుస్తామన్న విషయం ఎంతో వ్యత్యాసాన్ని చూపెడుతుంది. బాగా వేగంగా వేగంగా వారంలో మూడు సార్లు నడిచే మహిళల్లో, నెమ్మదిగా ఐదు సార్లు నడిచే మహిళల కంటే ఉదరం వద్ద కొవ్వు కరిగి పోతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వారంలో రెండున్నర గంటలు అంటే రోజుకు 21 నిమిషాల పాటు వేగంగా నడిస్తే చాలు గుండె సంబనిత రిస్క్ తగ్గిపోతుంది. నెమ్మదిగా మూడు నుంచి ఐదు నిమిషాలు నడిచి, తర్వాత ఐదు నుంచి పది నిముషాలు స్ట్రెచ్ చేసి ఒక మాదిరి వేగంతో కొద్ది సేపు నడిస్తే డయాబెటిస్ అవకాశాలు తగ్గుతాయి. బ్రిస్క్ వాకింగ్ వల్ల మెదడు నైపుణ్యాలు పెరిగి జ్ఞాపక శక్తి బావుంటుంది. మంచి నిద్ర పడుతుంది. భావోద్వేగ మానసిక పరిస్తితి బావుండి వత్తిడి తగ్గిపోతుంది. నీరెండలో నడవడం వల్ల శరీరానికి డి-విటమిన్ అంది ఎముకల ఆరోగ్యం బావుంటుంది.
Categories
WhatsApp

ఎన్నో ప్రయోజనాలున్న పవర్ వాక్

Leave a comment