పూవుల గుత్తిలో అందమైన రంగురంగుల పూలు ఆకులూ కలిపి ఆకర్షణీయం తయారు చేయటం చూశారు . కానీ ఒక చిన్ని మొక్కల్లో హరివిల్లు రంగులో అనేక మైన పూలు పూయిస్తున్నారు . పండ్లు ,కూరగాయల్ని అభివృధి చేసే గ్రాఫ్టింగ్ పద్దతిలో ఈ పూల మొక్కలు సృష్టి చేస్తున్నారు . పొడవాటి కాండం వచ్చేలా ఒక మొక్క పెంచి దాని పై భాగంలో వేరువేరు పూలు వచ్చేలా వేర్వేరు మొక్కలతో గ్రాఫ్టింగ్ చేస్తున్నారు . అప్పుడు ఒక కుండీలో పొడవుగా పెరిగిన ఒక కొమ్మకి వేరువేరు రంగుల్లో ,ఒకదానికి ఒకటి సంబంధం లేని ప్రకాశవంతమైన పూలు పూస్తాయి . ఒక గులాబీ మొక్కలో పది రకాల రంగు పూలు . ఒక మందార మొక్కలో పది రకాల రంగుల మందారాలు పూస్తాయన్నమాట . కాస్త జాగ్రత్తగా చేస్తే ఈ గ్రాఫ్టింగ్ మనకు కుదురుతుంది .

Leave a comment