ఫ్యాషన్ స్టయిలిస్ట్ లు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎర్రని రంగు ఎపుడూ ఫ్యాషన్ ఐకాన్ గా వుంటుందిట. ఆకర్షణీయమైన ఈ రెడ్ కలర్ ఎలాంటి డిజైన్ నయినా అద్భుతంగా ఆవిష్కరిస్తుందిట. రెడ్ కార్పెట్ సెలబ్రెటీలు ఏ రంగుల్లోనే డివైన్ లుక్ లో కనిపిస్తారట. వాళ్ళ దృష్టిలో ఇదో శక్తిమంతమైన రంగు. ఇటీవలే ఒక పరిశోధనలో కూడా ఎర్రని రంగు దృఢమైన ఆల్చనాలు సామర్ధ్యంతో కూడిన సున్నితమైన మనస్సుకు సూచన అంటున్నారు. చైనాలో ఎర్రని రంగును లక్కీ కలర్ గా  పరిగణిస్తారు. ఇది ఆధిక్యతను సూచించే కలర్ కూడా . ఎరుపు హార్ట్ రేట్ ను శ్వాసకు ఉద్దీప్తం చేస్తుంది. ఒత్తిడి ఫ్రేస్తేషన్ కోపం కూడా ఎక్కువ చేస్తుందీ రంగు. తమాషా ఏమిటంటే రాయబారుల్లో ఇలాంటి రంగు దుస్తులు ధరిస్తే ఇక అంతే సంగతులు. ఈ తీవ్రమైన రంగు ప్రశాంతమైన వాతావరణం ఇవ్వదంటున్నారు. సో ఇది అద్భుతమైన అందమైన రంగు. ఎర్రనీదుస్తులు ఎవరికైనా అందాన్ని ఇస్తాయి. అలాగే మనల్ని సీరియస్ గా  ఉండేట్టు చేస్తాయి.

Leave a comment