నాపైన వచ్చిన వ్యాఖ్యానాలు నన్నెంత బాధ పెట్టేయో చెప్పలేను . ఆ మాటలు నన్నెంతో నొప్పించాయి . నీ రంగుకు సినిమాలు కూడానా అన్నా రోజు కూడా ఉంది . కానీ నేనెప్పుడూ ఆత్మ విశ్వాసం పోగోట్టుకోలేదు ,నిరుత్సాహ పడలేదు . వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొన్న అంటోంది ఐశ్వర్య రాజేష్ . కౌశల్య కృష్ణమూర్తి సినిమాలో ప్రేక్షకులకు దగ్గర అయింది . ఈమె అచ్ఛం తెలుగమ్మాయి తమిళనాడు లో పుట్టిన ఐశ్వర్య తిరుపతి విద్యానికేతన్ లో చదువుకున్నది . సినీనటుడు రాజేష్ కూతురు . 2015లో కాకముట్లై తో నాకు బ్రేక్ వచ్చింది . నెమ్మదిగా ఎదుగుతూ వస్తున్నా అంటుంది వినయంగా ఐశ్వర్య . ఆమె నటనకు విమర్శకుల ప్రశంశలు దక్కాయి .

Leave a comment