మొదట్లో కొంచెం భయంగా అభద్రతలో ఉండే దాన్నీ. ఎప్పుడైతే ఇది కూడా ఒక ఉద్యోగం లాంటిదే అనుకున్నానో ఇక భయం పోయింది. ఇక జీవితమే మారిపోయింది అంటుంది సమంత. రంగస్థలం అయ్యాకా ఈ వేసవిలో మనహానటి, అభిమన్యుడు రాబోతున్నాయి. పెళ్ళయ్యాక అందిన కొత్త జీవితంతో పాటు ,బాధ్యతలతో పాటు నటిగా కూడా ఈ దశ చాలా బావుంది. ఒక్కసారి మంచి కథలు రాకపోతే సినిమాలు మానేద్దామనుకొన్నా . అదేమిటో అన్నీ మంచి కథలు అద్భుతమైన పాత్రలు ,కొత్త కథల్లో బాగం అవుతూ కొత్త పాత్రల్లో నటించటం ఎంతో ఉత్సహం ఇస్తుంది. జీవితంలో ఒత్తిడి లేని రోజుల్నీ అనుభవిస్తున్నానంటుంది సమంత. విజయవంతం అవుతున్న ప్రతి సినిమా నా ఆత్మశక్తిని పెంచుతున్నాయి అంటుంది సమంత.

Leave a comment