ఈ ప్రపంచంలో చాలా మంది సాధారణమైన వాళ్ళు ఎంతో అసాధరణమైన పనులు చేసి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తోటి వాళ్ళకోసం కష్టపడతారు. అలాంటి వాళ్ళలో స్వాతి గార్గ్ ఒకరు.ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో నివశించే ఇంటీరియర్ డిజైనర్ ఆమె నివశిస్తున్న తులిప్ ఆరెంజ్ అపార్ట్ మెంట్ లో నిప్పురాజుకుంది .మంటలు లేస్తున్నాయి,అందరూ మంచి నిద్రలో ఉన్నారు స్వాతి ఈ విషయం గమనించి పరుగులు తీస్తూ అన్ని అపార్ట్ మెంట్ తలుపులు కొడుతూ అప్రమత్తం చేసింది. అందరూ క్షేమంగా బయటపడ్డారు ఆమె భర్త నాలుగేళ్ళ కూతురు,ఆమె తల్లి కూడా. స్వాతి మాత్రం పదవ అంతస్థు వరకు వెళ్ళి అక్కడ తలుపు లాక్ అవటంతో ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయింది. అపార్ట్ మెంట్ వాసుల కోసం ప్రాణాలు కోల్పోయిన ఆమెకు అందరూ కన్నీటి వీడ్కోలు చెప్పారు.

Leave a comment