కెరీర్ మొదటి రోజులను గుర్తు తెచ్చుకొని చాలా ఆశ్చర్యపడుతాను అంటుంది సోనాక్షి సిన్హా. ఎంతో బొద్దుగా ఉండేదాన్ని ఎడతెగని డైటింగ్ లు ,కసరత్తులు…తలుచుకుంటే అవన్నీ నేనేనా చేసింది అనిపిస్తుంది అంటుంది సోనాక్షి సిన్హా. అందంగా ఉండటం అంత అవసరం అని నేను ఎప్పుడు ఊహించలేదు నటన ఒక్కటే చాలు అనుకొన్న .కానీ నటిగా పేరు తెచ్చుకొవాలంటే కొంత కాలం తెరపై కనించాలి, అందంతో సంబంధం లేని మనలో ఉన్నా టాటెంట్ ను ప్రేక్షకులు గుర్తుపట్టే వరకు అందం అవసరం ఉంటుంది. నా శరీరాకృతి పైన ఎన్నో విమర్శలు వచ్చాయి. సమాధానంగా నన్ను నేను మార్చుకొన్నాను. అందం అవసరాన్నీ గుర్తింపు అంటుంది సోనాక్షి. కానీ ఆ ప్రయాణం మాత్రం ఎప్పటాకీ మరిచి పోలేను. సినిమాపైన పుట్టుకొచ్చిన ప్రేమ నన్ను ఆ కష్టాన్నీ భరించేలా చేసింది అంటుంది సోనాక్షి సిన్హా.

Leave a comment