Categories
Gagana

ఎంత కష్టమైనా సాహిస్తానన్న కంగనా.

ఛేజింగ్ లు, కత్తి సాములు, స్టంటులు ఇవన్నీ సినిమాల్లో సహజం. ఇప్పుడు ఎంతటి ప్రమాదకరమైన ఫీట్ అయినా హీరోయిన్ లు కుడా సరే అంటున్నారు. బాలీవుడ్  క్వీన్ కంగనా రనౌత్ మణికర్ణిక డి క్వీన్ ఆఫ్ ఝాన్సీ లో నటిస్తుంది. ఇందులో రనౌత్ ది టైటిల్ రోల్. ఈ చిత్రం షూటింగ్ లో నీహర్ పాండే తో కత్తి యుద్ధం చేస్తుండగా కత్తి కాస్తా రనౌత్ కనుబొమ్మల మధ్య ఎముకను తాకేలా లోతుగా తెగింది. కత్తి తిప్పి టైమింగ్ కాస్త అటు ఇటు అయింది. కంగనాను ఆసుపత్రికి తరలిస్తే 15 కుట్లు పడ్డాయి అందరు కంగారు పడినా కంగనా మాత్రం, ఈ గాయం పెద్దగా నన్నేం బాధించలేదు ఎన్ని కత్తి గట్లు అయినా ఝాన్సీ లక్ష్మీ భాయ్ కోసం భరిస్తానని చెప్పేసింది.

Leave a comment