పాద రక్షలు ఇప్పుడు ఫ్యాషన్ లో అతి ముఖ్యమైన భాగం. ఎన్నో రకాలు, కొత్త డిజైన్స్, చాలా ఎత్తయినవి, చాలా టైట్ గా ఉండేవి, కొన్నయితే మోకాళ్ళ వరకూ పట్టేసినట్లు ఉండేవి వస్తున్నాయి. ఫ్యాషన్ సంగతి ఎలా ఉన్నా సరైన పాద రక్షలు ధరించకపోతే పలు అనారోగ్యాల బారిన పడక తప్పదంటున్నారు డాక్టర్లు. మూడువేల మందిపైన ఒక సంవత్సరం పైగా అధ్యయనం నిర్వహించారు. ఎంతో మంది తమ పాదాల కంటే చిన్నవో లేదా పెద్దవో వేసుకొంటున్నవారే ఎక్కువని సర్వే రిపోర్ట్. మరి శారీ మ్యాచింగ్ అని ఒక డిజైనర్ షూ ని కాస్త టైట్ గా వున్నా పర్లేదనుకొంటారు. కాస్త వదులైతే ఏమైoదనుకొంటారు. బిగుతుగా వుండే చెప్పులు ధరించినవారు నడుస్తూ అదుపు తప్పి పడిపోవడం, పాదాల నొప్పులు, నడకలో మార్పులు తదితర సమస్యలు గుర్తించారు. ఈ సమస్యలే భవిష్యత్తులో ప్రాణాంతకం కావొచ్చని వీరు హెచ్చరించారు. పాద రక్షణ విషయంలో సరైన కొలతలు ఎంచుకోవడం, ఫ్యాషన్ కోసం రక్త ప్రసరణ సరిగా జరగకుండా అడ్డుకొనే చెప్పులను అవతల పెట్టడం మంచిది.
Categories
WhatsApp

ఎంత కొత్త డిజైన్లయినా సరే వద్దు

Leave a comment