అందమైన ఇళ్ళు అలంకరణలో ఇప్పుడు స్టోన్ పజ్ నడుస్తోంది. ఇంటీరియర్స్ లో ఇప్పుడు రాళ్ళ అలంకరణే  టాప్ . హాలు, బెడ్ రూమ్స్ , కిచెన్ లు స్టోన్ ప్యానల్ షీట్స్ తో డెకరేట్ చేయటం ఫ్యాషన్ . సిమెంట్ గోడలకు రాతి షీట్లు అలంకరించేస్తారు. ఈ రాతి పలకలు కాకుండా పూర్తిగా రాళ్ళతోనే డెకరేట్ చేస్తున్నారు.  డ్రాయింగ్ రూమ్ రాళ్ళ నీటి తోట్టె అరెంజ్ చేసి అందులో నీళ్ళు నింపెసి తామర పువ్వులతో నింపెస్తే ఇల్లు అందంతో నెంబర్ వన్ అయిపోతుంది. ఈ రాళ్ళు సహాజ వర్ణాలతో సహజత్వం పోకుండా ఎన్నో రూపాలు ,పరిమాణాల్లో చక్కని అలంకరణలు చేస్తున్నారు. ఈ రాక్ డిజైన్స్ కళ్ళను కట్టి పడేస్తున్నాయి.

Leave a comment