ప్లాస్టిక్ వాడకానికి సంబంధించి కొన్ని గణాంకాలు మానవాళి మనుగడకు అది ఎంత ముప్పు తెస్తుందో రుజువు చేస్తున్నాయి . ప్రపంచ వ్యాప్తంగా నిముషానికి పది లక్షల నీళ్ళ సీసాలు అమ్ముతున్నారు. క్యారీ బాగ్స్ ఇరవై లక్షల కంటే ఎక్కువే. రోజుకు ఐదు కోట్ల స్ట్రాలు చెత్త కుప్పలో పడుతున్నాయి. 13 కోట్ల ప్లాస్టిక్ టి కప్పులు రోజుకు వాడి పడేస్తున్నారు నిముషానికి ఓ ట్రక్కు ప్లాస్టిక్ చెత్త సముద్రంలో కలుస్తోంది. ఇందులో ఎక్కువ హిందూ మహా సముద్రంలో కలుస్తోంది. ఎప్పుడో దీన్ని వల్ల ప్రళయం తప్పదంటున్నారు. 85 శాతం నల్లా లో వచ్చే నీళ్ళలో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నాయి ఈ నీటితో వారానికి ఐదు గ్రాముల ప్లాస్టిక్ మన కడుపులోకి వెళుతోంది. ప్లాస్టిక్ వాడకం ఎంత త్వరగా మానేస్తే అంతా మంచిది కదా.

Leave a comment