కోందరిని ఎప్పుడు తలుచుకోవాలి సమస్యలు ఎదురైనా చివరకు విధి కూడా పగబట్టినా ఎలా నెగ్గుకొచ్చారో తెలుసుకుంటే జీవితం పట్ల ప్రేమ ఎక్కువవుతుంది. కిరన్ కనోజియా మనం దేశంలో మొదటి బ్లెడ్ రన్నర్. సాఫ్ట్వేర్ ప్రోఫెషనల్ తన 25వ పుట్టినరోజు చేసుకునేందుకు ఫరీదాబాద్ బయలుదేరింది. తను దిగబోయే స్టేషన్ వస్తుందని తలుపు దగ్గర నిలబడ్డ ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ లాక్కోవాలని ట్రై చేసిన దుండగులు ఆమెను ట్రైన్ లో నుంచి తోసేసారు. ఆమె కాలు తలుపులో చిక్కుకుని కిందకు వేలాడిపోయింది కిరణ్. ప్రయాణికులు గుర్తించు ఎమర్జెన్సీ చైన్ లాగేందుకు ప్రయత్నించినా ఆమెను ప్రమాదంలో నుంచి కాపాడలేకపోయారు. కాలు పోగొట్టుకున్న కిరణ్ ఎంతో కష్టానికి ఓర్చి బ్లేడ్ రన్నింగ్ సాధన చేసింది. దేశంలో ఎక్కడ పరుగు పందెలు జరిగినా పాల్గోంటుంది.

Leave a comment