కొంత మంది స్ఫూర్తి దాతలు నిజంగానే కోట్ల మందికి ఆదర్శం . ఒక ప్రయత్నం చేసి వెంటనే ఫలితం రాకపోతే వెంటనే ఆ పని వదిలేసి నిరుత్సహ పడే వాళ్ళు వందల మంది కానీ ఎందుకు నా వల్ల కాదు.. ఎందుకు ప్రయత్నం చేయను అనుకొంటే ఏదైనా సాధ్యమే. దాన్ని నిరూపించింది దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరానికి చెందిన ఛాసా సూన్ . ఇప్పుడు 80 ఏళ్లు వచ్చి ఉంటాయి. సొంత వాహనంలో ఇంటింటికీ తిరిగి సామాన్లు అమ్ముకోవటం ఆమె డ్రీమ్ డ్రైవింగ్ టెస్ట్ కి అప్లై చేసి ఫేయిల్ అయింది . పట్టు వదలకుండా 950 సార్లుప్రయత్నించి 951 సారి పాసై పోయి కోరిక నెరవేర్చుకొంది . దరఖాస్తు పీజులకే ఆమె 4000 డాలర్లు ఖర్చు చేసిందిట . నిజంగా మనసుంటే మార్గం ఉండదా ?

Leave a comment