డియానే డీ మెనేజస్ ముంబాయిలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చదువుకుంది.ఒక మల్టీ నేషనల్ కంఫెనీలో రిసెర్చ్ అనలిస్టుగా పనిచేస్తున్న డియానే ఎన్నో సామజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనేది.బహిస్టు విషయంలో ఆ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి మహిళల్లో ఉండే అపోహలు పోగొట్టాలనే ఆశయంలో రెడ్ ఈజ్ రిన్యూ గ్రీన్ ప్రాజెక్టు మొదలుపెట్టారు.ఈ ప్రాజెక్టు ద్వారా శానిటరి నాప్ కిన్స్ కొనే స్థోమత లేనివాళ్ళకు వాటిని అందుబాటులో ఉంచుతారు.స్కూళ్ళలో కాలేజీల్లో వాటికోసం వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు.వినియోగించి పారేయకుండా బర్న్ చేసేందుకు యంత్రాలను పెట్టారు. డియానే చేస్తున్న ఈ సేవకు గాను ఆమెకు ప్రతిస్టాత్మకమైన క్వీన్స్ యంగ్ లీడర్స్ అవార్డును ఇంగ్లాండ్ రాణి రెండో ఎలిజిబెత్ చేతుల మీదుగా అందుకున్నారు.
Categories