ఎంతో ఆధునికంగా కనిపిస్తున్నా ప్రత్యేక సందర్భాల్లో అమ్మాయిలు పాత కాలపు నగలు ,పట్టు లంగాలే కోరుకొంటారు. రాత్రి వేళ జరిగే ఫంక్షన్స్ లో కళ్ళకు ఆకట్టుకునేది రాళ్ళతో కూడిన సంప్రదాయ నగలే . ముఖ్యంగా అమ్మాయిలకు బుట్ట చేతులతో జాకెట్లు, పరికిణీలకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేది వంకీలు . కుడిమోచేతికిపైగా ఈ రాళ్ళ వంకీలు ప్రత్యేకంగా అందంగా ఉంటాయి. ఈ వంకీల్లో వజ్రాలు మెరిసే రాళ్ళు ఉంటే ఇంకా ఆ రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. సాదాసీదా బంగారువి కాకుండా టెంపుల్ నక్ష డిజైన్ వంకీలు చక్కని పని తనంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Leave a comment