అమెరికాకు చెందిన ముల్లెర్ కోరెనక్, ఉటాహ్ లో గంటకు 296 కిలోమీటర్ల వేగంతో సైకిల్ తొక్కి రికార్డ్ బద్ధలు కొట్టింది. సాధారణంగా ఎంతో కష్టపడ్డ గంటకు 100 కిలో మీటర్లు దాటటం కష్టం . అలాంటిది 8 కిలో మీటర్ల రేస్ లో మూడున్నర కిలోమీటర్ల వేగాన్ని అందుకొనేందుకు రేస్ కారు సాయం తీసుకొని మిగిలిన నాలుగున్నర కిలో మీటర్లూ స్వయంగా సైకిల్ తొక్కుతూ 296 కిలో మీటర్ల గరిష్ట వేగం అందుకొంది ముల్లెర్. గతంలో సైకిల్పై ఉన్న అత్యధిక వేగం 268 కిలో మీటర్లు .ఈ అమెరికన్ మహిళ గతంలో ఉన్న రికార్డ్ ను దాటేసింది.

Leave a comment