ఇంటి అలంకరణలో ముఖ్యంగా బెడ్ రూమ్ ,బాత్ రూమ్ లివింగ్ రూమ్స్ లో డిజైనర్ మిర్రర్స్ స్టైల్ ఐకాన్స్ గా ఉన్నాయి. యాంటీక్ స్టైల్ ,రెక్టాంగ్యూలర్ ,రౌండ్ ,ఓవెల్ ట్రెడిషనల్ ఇలా బోలెడన్ని రకాలు .ఇంటికి వెలుగును అందాన్ని ఇస్తాయి. చిన్న గదుల్లో అందమైన అద్దాలు ఇల్లు విశాలంగా ఉన్నట్లు చూపెడతాయి. కిటికీలకు ఎదురుగా ఒక డిజైనర్ మిర్రర్ ఏర్పాటు చేస్తే విండోలోంచి పడే వెలుగు గది మొత్తం కనిపిస్తుంది. కాకపోతే డ్రెస్సింగ్ ఏరియాలో బాత్ రూమ్స్ దగ్గర మిర్రర్స్ సింపుల్ గా బయటటికి వెళ్ళెందుకు రెడీ అయ్యేందుకు వీలుగా ఉంటాయి. యాంటీక్ ,వింటేజ్ మెటల్ ,ఉడ్ ,ఫ్రేమ్ లేస్ డిజైన్స్ మిర్రర్స్ ఎన్ని షేప్స్ లో ఇంటిని వెలగించేస్తాయి. ఇల్లు కాస్త కొత్తగా అలంకరించాలంటే మంచి మాంటీక్ మిర్రర్ తీసుకోవలసిందే.

Leave a comment