ఇంట్లో ఖాళీ సమయాల్లో కొన్ని చిన్న పాటి వ్యాపారాలు నడపవచ్చు.పర్యావరణానికి హాని కలగించని వస్తువుల తయారీ ఎంచు కొంటే మంచింది. పేపర్ బ్యాగ్స్ ,జ్యూట్ బ్యాగ్స్. తయారి వంటివి ఒక నెల రోజుల ట్రైనింగ్ తీసుకొంటే మొదలు పెట్టవచ్చు. ఇంకో ఐదారుగురు ఆడవాళ్ళకు కూడా పని కల్పించవచ్చు. జ్యూట్ తో తయారు అయిన హాండ్ బ్యాగ్స్ ,సూట్ కేసులు ,షాపింగ్ బ్యాగ్స్ ఫొల్డర్స్ ప్రోషేషనల్ బ్యాగ్స్, విండో కర్టెన్స్ కూడా తయారు చేయవచ్చు. సాధారణంగా ఉన్న వాటి పైన కాలంకారి ఆప్టిక్ వర్క్ ,పెయింటింగ్ ప్రింట్లు డిజైన్ చేయించి వాడవచ్చు. కాలేజీ స్టూడెంట్స్ తీసుకుపోయో బ్యాక్ పాక్స్ పైన చక్కని ఫ్యాబ్రిక్ డిజైన్ వేస్తే చాలా బావుంటుంది. ప్రస్తుత రోజుల్లో అందరూ పర్యావరణ హితంగా ఉండే వస్తువులు వాడుతున్నారు. కనుక ఈ చిన్న వ్యాపారానికి మంచి సపోర్ట్ దోరుకుతోంది.

Leave a comment