నీహారికా,

కొత్తగా ఉద్యోగంలో కల్యాణి తన ఫస్ట్ నెలసరి చెక్ ని ఎంతో సంతోషంగా నాకు చూపించడం చూసాను. ఆ అమ్మాయి మోహంలో ఎంత ఆనందం. మీరిద్దరూ ఆ రోజుని సెలబ్రేట్ చేసుకున్నారు కదా. ఎవరెవరికి ఎం కొనాలో కుడా గంటల కొద్దీ చర్చించారు. కల్యానికి అడ్వయిజ్ చేసేదేమిటంటే మొట్టమొదట ఖర్చు పై నిషేధం విధించుకోమని. భవిష్యత్తు లో ఆ ఆర్ధిక క్రమశిక్షణ ఎంతో తోడ్పడుతుంది. సంపాదన మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి ఎంతో కొంత సేవింగ్ గురించి ఆలోచించాలి. అది మోతద్తి జీతం తీసుకొన్నప్పుదే ఆలోచన ఆచరణ లోకి రావాలి. పొదుపు పధకాలలో పెడతారు, ఇంకో రకంగా సేవ చేస్తారు. తర్వాత సంపాదన లోంచి చర్చు లోంచి కొంచెం పొడుపు అత్యవసరం. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒడిదుడుకులోంచి ఆ సేవింగ్స్ బయట పడేస్తాయి. ధైర్యం ఇస్తాయి. ఆలోచించండి. పొడుపు చేయాలి. అయితే ఎంత అన్నది మీ ఇష్టం భవిష్యట్టును కళ్ళముందు ఉంచుకోండి చాలు.

Leave a comment