ఇప్పుడు వస్తున్న కొన్ని ఆవిష్కరణలు నిజంగా ఎంతో ఉపకారం చేసేవి. కష్టాల్లో పడిపోకుండా మన్యుషులను ముందే ఆదుకునేవి. అలాంటి ప్రయోజనం ఇచ్చే ‘ మేక్ యాప్’ అనే కొత్త యాప్ ను రష్యాకి చెందిన అషాట్ యాబ్రావోల్  అనే యాప్ డెవలపర్ సృస్టించాడు. ఈ Make App ను ఆటను చాలా శ్రద్ధతో ఆడపిల్లల అక్రమ రవాణా అరికట్టే దిశగా ఉపయోగ పడేందుకు  గానూ తయారు చేశాడు. అక్రమ రవాణాలో ఆడపిల్లలను గుర్తు పట్టలేని విధంగా మేకప్ చేసి వాళ్ళ పాప పోర్ట్ లు సృష్టిస్తున్నారు. ఈ మేకప్ తో వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులే గుర్తించడం చాలా కష్టం. ఇప్పుడు ఈ  మేకప్ రూమ్ లో ఫోటో ను అప్ లోడ్ చేస్తే మేకప్ లేకుండా వుండే అమ్మాయిని చూపెడుతుంది. ఈ యాప్ ఎంతో మంది అమ్మాయిలు అక్రమ రవాణాకు గురి కాకుండా తప్పని సరిగా ఉపయోగపడుతుంది.

Leave a comment