ఫుడ్ పాయిజనింగ్ ఇప్పుడు వినిపిస్తూనే వుంటుంది. ఎంత పరిశుభ్రమైన చోట భోజనం చేసినా ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అవ్వుతుందో కారణాలు వెతుకుతూనే వుండాలి. మొలకెత్తే విత్తనాలు, పండ్లు, ట్యూణీ చేపలు కుడా కడుపులో విషపూరితమైన సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, ప్రణాల మీదకు వస్తుంది కుడా. వంట గది పరిశుబ్రత, వ్యక్తిగత పరిశుబ్రత విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. వంట పాత్రలు పరిశుభ్రంగా వుండాలి. వంటకాల్లో వండినవి పచ్చి కూరల్లో కలిపి మళ్ళీ వండటం అస్సలు చేయకూడదు. త్వరగా పాడయ్యేవి, ఎక్కువ రోజులు నిలువ వుండే పదార్ధాలు కలిపి ఫ్రిజ్ లో పెట్టకూడదు. చేతులు శుబ్రం చేసుకునే వంట మేడలు పెట్టాలి. వంట సమయంలో, వందే వస్తువులు, తుడిచే గుడ్డలు పదార్ధాలు ప్రతి విషయం వెయ్యి కళ్ళ తో గమనించూకోవాలి. వంట పదార్ధాల్లో వుండే బాక్టీరీయా నశించి పోయేంత వేడి తో వంట చేయాలి.
Categories