ఎప్పుడు ఒకేలాటి వ్యాయామం విసిగిస్తూ పోతే ఒకసారి వాటర్ ఏరోబిక్స్ ఎంచుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇటు ఉల్లాసం అటు వ్యాయామం రెండు దక్కుతాయి అంటున్నారు . అధిక బరువుతో బాధపడే వారికి ఏ వ్యాయామం చేయాలన్న బద్దకంగా ఉంటుంది . అలాటి వాళ్ళకి ఈ వాటర్ ఏరోబిక్స్ కష్టం ఉండదు . 80 శాతం శరీరం మునిగి ఉంటుంది కనుక శరీరం బరువు అనిపించదు . తేలికగా వ్యాయామాలు చేయవచ్చు కీళ్ళ నొప్పులున్నా ఈ వాటర్ ఏరోబిక్స్ తో ఆ సమస్య ఉండదు అలాగే సర్జరీల అనంతరం శరీరాన్ని మళ్ళి  కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి అనుకొంటే ఈ వాటర్ ఏరోబిక్స్ ఎంచుకోవచ్చు . ఈ వ్యాయామం తో నొప్పులు తగ్గి శరీరంలో ప్లెక్సీ బిలిటీ  పెరుగుతుంది

Leave a comment