కారణాలు కొన్ని,ఎన్ని పరిశోధనలు చేసినా పూర్తిగా బయటపడవుగానీ రోజు మొత్తంలో కొన్ని పదార్థాలని కొన్ని సమయాల్లో తినాలని అనిపిస్తుందట. దీనికి శాస్త్రీయ బద్దత ఉందంటారు నిపుణులు. నూనెతో చేసిన వేపుడు పదార్థాలు మధ్యాహ్నం వేళ తినాలని మనసు ప్రేరేపిస్తుంది. డిన్నర్ తర్వాత రాత్రి ఎనిమిది ,తొమ్మిది గంటలకు తీపి తినాలనిపిస్తుందట. అలాగే ఆరోగ్యవంతమైన స్నాక్స్ ఇళ్ళల్లో కంటే బయటే తింటూ ఉంటారట. 40 శాతం మంది స్నాక్స్ లో నట్స్ ఇష్టపడరు కానీ అదే స్నాక్స్ ని బయట హోటళ్ళలో ఆర్డర్ చేసి ఇష్టంగా తింటూ ఉంటారని ఒక అధ్యయనం చెపుతుంది. ఇది కరక్టో కాదో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని తేల్చుకోవలసిందే.

Leave a comment