97 ఏళ్ళ వచ్చాక మా ఇంట్లో వాళ్ళకి నేను చదువు కొంటానని చెప్పను . మా మనవలు మనవరాళ్లు 15 మంది ఉన్నారు . వాళ్ళ సాయంతో అక్షరాలు నేర్చుకొని నాలుగో తరగతి ప్రవేశ పరీక్షలో రాష్ట్రంలోనే టాపర్ గా ఉన్నా . ఇప్పుడు అవార్డు వచ్చింది . దానికోసం ఇప్పుడు విమానం కూడా ఎక్కబోతున్నా “అంటోంది కాత్యాయని అమ్మ . కేరళలోని చేప్పాడు దగ్గరున్న మొత్తం ప్రాంతానికి చెందిన కాత్యాయని వయసు 99. 14 వ ఏటా వ్యవసాయ కుటుంబానికి చెందిన కృష్ణ బొట్ల తో పెళ్ళయింది . పిల్లలు కలిగాక భర్త మరణించటంతో గుడిని శుభ్రం చేసే పనిలో చేరారు కాత్యాయని నెలకు 20 రూపాయిలు జీతంతో నలుగురు ఆడపిల్లలను ,ఇద్దరు మగ పిల్లలను పెద్దచేసిందామె . బాధ్యతలు తీర్చుకొని ఇప్పుడు చదువుకొని పరీక్షలు పాసైయింది . నారి శక్తి పురష్కారానికి ఎంపికైంది కాత్యాయని అమ్మ .

Leave a comment