Categories
Gagana

ఎప్పుడూ కష్టపడాల్సిందే

క్వీన్ రీమెక్ లో నటిస్తుంది తమన్న. ఈ చిత్రం గురించి చెబుతూ 100 % లవ్ సినిమాలో నా పేరు మహాలక్ష్మీ ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రానికి కూడా దటీజ్ మహాలక్ష్మీ అనే పేరు ఖారారు చేయడం నాకెంతో నచ్చింది. ఇంతవరకు నేను వచ్చానంటే సినిమా కోసం నేను ఎంత కష్టపడతానో అర్ధం చేసుకోవచ్చు. బాహుబలి సినిమా కోసం యుద్ద విన్యాసాలు నేర్చుకున్నాను. ఇప్పుడో సినిమాకోసం కూచిపుడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను.  హీరోలతో సమానంగా మేం కష్టపడాల్సిందే. ఎన్ని త్యాగాలు చేయాలి చివరకు ఇష్టమైంది తినేందుకు కూడా కుదరదు. వేపుళ్ళు,ఐస్ క్రీమ్ లు నాకు ఇష్టం. మంచి శారీరాకృతి కోసం అవన్ని త్యాగం చేయాల్సిందే. ప్రతి రోజు గంట, రెండు గంటలు జిమ్ లో గడపాల్సిందే అంటుంది తమన్నా.

Leave a comment