ఈ పాత్రని నేను చేయక పొతే ఇంకెవరు చేస్తారనుకుంటాను. అందుకే ఆ ఆత్మవిశ్వాసంతోనే నా కెరీర్ ఆరంభం నుంచి ఫలానా పాత్ర చేయలేనని నేనే సినిమా వదులుకోలేదు అంటోంది కధానాయిక శృతి హాసన్. కాటమరాయుడు సక్సెస్ తర్వాత ఆమె తమిళ సినిమాలో బిజీగా వుంది. అసౌకర్యం అన్న పదం నానిఘంటువులో వుండదు. చిన్నప్పటి నుంచి నువ్వు చేయలేవని నాతో అన్న పనులని  చేసేందుకు సిద్ధ పడే దాన్ని స్కూల్ లో సంగీతం, ఆటలు లాంటి విషయాల పైన మనస్సు పెట్టి చదువు నిర్లక్ష్యం చేసేదాన్ని కానీ తీరా పరీక్షలోచ్చాక రేయిబవళ్ళు చదివి మంచి మార్కులు సాధించేదాన్ని. వేరే వాళ్ళు ఈ కాస్త సమయం సరిపోతుందా అని భయపడతారు. నాకెప్పుడు భయం లేదు. చినప్పటి పరీక్షల రోజుల్లాగే ఇప్పుడు రంగం లోకి దూకితే ఆ పని పూర్తి చేస్తా. ఈ మానవత్వం వృత్తి పరంగా నేకేంతో మేలు చేసింది అంటోంది శ్రుతి. నిజమే సంకల్ప బలం ముందు ఏదైనా ఓడిపోతుంది అంటారు.

Leave a comment