మేకప్ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వేసవిలో కొంత ఫ్రెష్ లుక్ ఉంటుంది. అలంకారణ చేసుకొనే ముందర ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకొంటే ఎక్కువ సేపు మేకప్ నిలిచి ఉంటుంది.  లిప్ స్టిక్, లిప్లైనర్ ఒకటి ముదురు మరోకటి లేత రంగులో ఎంచుకోవాలి లిప్ స్టిక్   లైనర్ కన్న లేతగా ఉండాలి. రాత్రి పూట వేడుకులకు లిప్ స్టిక్ ,ఐషాడో ముదురు రంగులే వేసుకొన్న బావుంటుంది. కాస్త రంగు తక్కువగా ఉన్న ముదురు రంగు మేకప్ బానే ఉంటుంది. మస్కరాన్ కింది రెప్పలకు కూడా రాసుకొవచ్చు. అప్పుడే కళ్ళు పెద్దవిగా తాజాగా అనిపిస్తాయి. అది నలుపు రంగు మస్కరాన్ అయి ఉండక్కర్లేదు. మిగతా రంగుల్లో కూడా ప్రయత్నం చేయవచ్చు .ఎప్పుడు ఒకేలా కాకుండా భిన్నంగా ప్రయత్నిస్తేనే మంచి లుక్ వస్తుంది.

Leave a comment