ఈ కాలంలో చక్కని అందమైన చీరె పైకి శాలువ బావుంటుంది. అదే శారీ డిజైన్ లో కలిసిపోయే శాలువ కనుక రెండు కలిసే దొరికితే స్టయిల్ గా ఉంటుంది. నిజమే ఇప్పుడు చీరెలలో అదే ప్రింట్ తో ఉన్న చున్నిలు లేదా ఉన్ని శాలువాలు కలిసే వస్తున్నాయి. ధోతీ శారీ అయితే పూర్తి కంట్రాస్ట్ గా ఎంబ్రాయిడరీ ముఖమల్ శాలువ కప్పుకుంటే ఎంతో గ్రాండ్ లుక్ వస్తుంది. అచ్చు చీరె అంచులాంటి శాలువలు ఒకే డిజైన్ పుర్తిగా చీరె,శాలువ కలిపి బ్లౌజ్ కలర్,డిజైన్ తో శాలువలు కాంబినేషన్ ఏ పార్టీలో అయినా ప్రత్యేకంగా ఉంటుంది. ఆన్ లైన్ లో ఈ స్టయిలిస్ కాంబినేషన్స్ ఎన్నో ఉన్నాయి. చూసి ఆర్డర్ ఇవ్వడమే.

Leave a comment