ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటే కుందన్ జ్యూయలర్ వైపు చూడోచ్చు. ఇప్పుడు పాల్కీ కుందన్ వైట్ కుందన్ బాగా ఇష్టపడుతున్నారు. కుందన్ నగల్లో మేలు జాతి రాళ్ళు పొదిగేందుకు లక్క వాడతారు. నగల మార్పిడి సమయంలో నష్టం రాకుండా ముందే ఈ లక్క శాతం గురించి తేల్చుకుంటే మంచిదే. రియల్ పాల్కీరాళ్ళు, గో మేధికాలు ఎమరాల్డ్ మొదలైన రాళ్ళను కుందన్ నగల్లో పొదుగుతారు. వేడుకల్లో చక్కని దుస్తులతో పాటు ఈ కుందన్ నగలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. నెక్లెస్ లు, పొడవాటి హారాలు, వడ్డాణం,వంకీలు, ఇయర్ రింగ్స్, నోస్ రింగ్స్ అన్ని కుందన్ వే తీసుకోవచ్చు. తెల్లని కుందన్ నగలు చాలా బావుంటాయి కాని నాలుగైదేళ్ళకు కాస్త రంగు తగ్గిపోతాయి. అంచేత ఎర్రరాళ్ళని ఎంచుకోవడం బెస్ట్.

Leave a comment