అమెరికా,న్యూ యార్క్ లోని షేల్ క్రిక్ ప్రిజర్వే లో ఒక జలపాతం ఉంది ,ఎంతో అందమైంది . కొండల పై నుంచి గలగల దూకే నీటి సవ్వడి చుట్టూ అందమైన ప్రకృతి . ఇంత వరకే అయితే పర్లేదు . ఆ నీటి దారాల మధ్య లో ఓ చిన్ని గుహ . అందులో వెలుగు అందుకే ఈ జలపాతాన్ని ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ అంటారు . ఆధ్యాత్మిక వెలుగు . ఆ గుహ వంటి ప్రదేశంలో ఆ జ్యోతి ఎప్పుడూ వెలుగు తూనే ఉంటుంది . నూనె పోయలేదు. వత్తి వేసి వెలిగించ లేదు గూటిలో రాయి కింద నుంచి వెలువడే సహజ వాయువు తోనే ఈ దీపం వెలుగుతుంది ఈ ఫ్లేమ్ ను చూపెందుకు ఎంతో మంది పర్యాటకులు అక్కడి కి వెళతారు

Leave a comment