ఎత్తు తక్కువగా ఉన్న,మోడరన్ గా కనిపించాలనుకొన్న అమ్మాయిలు హీల్స్ వేసుకొంటారు. ముని వేళ్ళ పైన ఒత్తిడి తగలకుండా ముందుగా కాలి గోళ్ళు పొడుగ్గా లేకుండా కత్తిరించుకొని ఈ హీల్స్ వేసుకొండి ,సౌకర్యంగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పాదాల పగుళ్ళు ఇతర ఇన్ ఫెక్షన్లు లేకుండా చూసుకోవాలి. చూసేందుకు పాదాల మృదువుగా కనిపించాలి. ఫ్యూమిక్ రాయితో మృత కణాలు పోయేలా రుద్దీ పాదాలకు మాయిశ్చరైజర్ లేదా పెట్రోలియం జెల్ల్ తో మర్ధన చేస్తే పొడిబారిపోకుండా ఉంటాయి. ఏ కాలంలో అయినా కొందరికి పాదాల్లో కూడా చమట పోస్తుంది.యాపిల్ సిడాక్ వెనిగర్ రాసి కాసేపు ఆగి కడిగేస్తే పాదాలు చమట దుర్వాసన లేకుండా ఉంటాయి. ఎత్తు చెప్పుల అందమే కానీ పాదాలు కూడా శుభ్రంగా ఉంటే ఆ చెప్పుల అందం రెట్టింపు అవుతుంది.

Leave a comment