ఈ ఆధునిక కాలంలో ముందస్తూ జాగ్రత్తగా వ్యాధులు రాకుండా కొన్ని పదార్థాలను ఆహారంలో భాగంగా చేర్చుకొంటున్నారు. వీటిలో వీట్ గ్రాస్ జ్యూస్ చాలా ముఖ్యమైనది. హైపర్ టెన్షన్ కు ఇది ఎంతో త్వరగా చెక్ పెట్టేస్తుంది. మెగ్నిషియం ,పోటాషియంలకు మంచి ఆధారం.అలాగే వెల్లుల్లి రక్తాన్ని పల్చబరచటం లో సహాకరిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించటంలో ముందుంటుంది. రక్త నాళాల్లో ప్లేక్ ఏర్పడటాన్ని తగ్గించి క్లాటెంగ్ ను అరికడుతోంది. ఓట్స్ లోని సోల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. టోమోటో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని అరికడుతోంది. అనారోగ్యాలకు సంబంధించిన మందులు తీసుకొంటూ ఈ పదార్థాలను ఆహారంలో భాగంగా చేర్చుకోమంటున్నారు వైద్యులు.

Leave a comment