గుజరాత్ లోని కచ్ పచ్చికమ్ జ్యూవెలరీకి ప్రసిద్ది. ఇవి ఎంతో సున్నితమైన నగలు. ఈ నగలకు చేసే మెటల్ గా వెండిని వాడతారు. అంచేత ఈవి ప్లాటినమ్ నగల్లా కనిపిస్తాయి.అన్ కట్ గ్లాస్, సెమీ ప్రెషియన్ స్టోన్స్ పొదిగిన ఈ నగలు చెత్తో చాలా శ్రద్దగా చెక్కినట్లు తయారు చేస్తారు.తెలుపు,ఏరుపు,ఆకుపచ్చ ఇలా ముదురు రంగుల జాతి రాళ్ళను వాడి ఈ నగలు చేస్తారు.ముత్యాల అల్లిక చాలా ప్రత్యేకం.జరీ గళ్ళ పట్టు చీరెలకు ఈ నగలు చాలా చక్కగా సూటవుతాయి.బ్రాస్ లెట్స్ పెద్ద సైజ్ జుంకాలు పచ్చీకమ్ నగల్లో సింపుల్ గా ఉంటాయి. రాచరికపు స్టైల్ లో ఉండే ఈ నగలు వేడుకలకు చాలా బావుంటాయి.

Leave a comment