ఆపిల్ సిడార్ వెనిగర్ లో ఉండే ఎసిటిక్ యాసిడ్ శరీర బరువు తగ్గించటంలో సాయపడుతుందని పరిశోధనలు చెపుతున్నాయి.సాధరణంగా పోషక విలువలున్న ద్రవ పదార్ధాలు తఈసుకుంటే సన్నబడవచ్చని డైటీషియన్లు చెబుతారు.యాంటీ అక్సిడెంట్లు సమృద్దిగా ఉండే గ్రీన్ టీ పాలతో గాని,నీళ్ళతో గాని తీసుకోవాలి. ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది. క్రాన్ బెర్రి జ్యూస్ లో ఉండే ఆంథో సయానిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇన్ ఫెక్షన్ లు రానివ్వకుండా చేసి శరీర భాగాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది. రోజు పసుపు టీ తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం క్రమపద్దతిలో జరుగుతుంది. మెంతి గింజల పొడి , జ్యూస్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

Leave a comment