ఎంతగా స్వేదం చిందిస్తే అంతగా క్యాలరీలో ఖర్చవుతాయి అనేది అపోహ మాత్రమే అంటున్నారు. ఎక్సపర్ట్స్. అస్సలు స్వేదానికి క్యాలరీలకు సంభంధం ఉందట. స్వేదం శారీరిక ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. ఇక క్యాలరీలు ఖర్చు చేయటం అన్నది వర్కవుట్ల సమయం ఇంటెన్సిటీ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఖాళీ కడుపులో వర్కవుట్స్ చేయటం వల్ల  కొవ్వు కరుగుతుందని భావిస్తారు. ఇది పూర్తిగా అపోహ. ఇలా చేయటం వల్ల  ఎక్సర్ సైజ్ లు ఇంటెన్సిటీ లోపిస్తుంది. దీని వల్ల  ఎక్కువ క్యాలరీలు ఖర్చు కావు. వర్కవుట్స్  కు అరగంట ముందుగా అరటి పండు లాంటివి ఏవైనా తింటే మంచిది. అలాగే వ్యాయామం ఎలాగూ చేస్తున్నాం కదా అని గంటల కొద్దీ కదలకుండా కూర్చునే జీవనశైలి ప్రధాన అనారోగ్య హేతువు. అంచేత గంటలకోసారి లేచి కాస్త నడవాలి. అధికంగా బరువు లేము కదా అనీ ఏ వ్యాయామం చేయకపోవటం కూడా తప్పే . శారీరికంగా చైతన్యంగా ఉండటంకోసం వ్యాయామం తప్పని సరి .

 

Leave a comment