సంతానోత్పత్తికి ఆహార పదార్ధాల లోని కొన్ని పోషకాలు ఎంతో సహకరిస్తాయి. హార్మోన్ల సక్రమ ప్రక్రియ కు అవసరమైన ప్రత్యేక పోషకాలు పిండం ఎదుగుదలఅండం ఆరోగ్యం వీర్య ఆరోగ్యం  రక్త ఆరోగ్యం వంటివి శరీరానికి అందిస్తూ శరీరానికి మద్దత్తు ఇచ్చే ఆహారాన్ని సహజ ఫెర్టిలిటీ డైట్ అనచ్చు. ఈ డైట్ లో విటమిన్ సి వుండే తాజా పళ్ళు ఔషధ గుణాల వెల్లుల్లి ఫ్యాటీ యాసిడ్స్ వుండే చేపలు ఆకు కూరలు డైయిరీ ఉత్పత్తులు బాదం వాల్నట్స్ ఉడికించిన బంగాళా దుంపలు చిరు ధాన్యాలు సెరల్స్ బొప్పాయి చెర్రీలు పుట్ట గొడుగులు ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె వంటివి భాగంగా ఉంటాయి. మహిళలు ఆరోగ్యవంతంగా గర్భం ధరించేందుకు డాక్టర్లు ఇచ్చే మందులతో పాటు ఇచ్చే డైట్ చార్ట్ లు ఇవన్నీ ఉంటాయి. ఈ డైట్ ఫెర్టిలిటీ ఫుడ్ కాబోయే తల్లికీ కడుపులో పెరగబోయే శిశువుకు రక్ష వంటివి. ఆరోగ్యం ఆహారం  పక్కపక్కనే ఉంటాయి మనం గ్రహించగలిగితే.

Leave a comment