సన్నగా వున్న వాళ్ళు ఎవరైనా వ్యయామం చేస్తుంటే ఇప్పుడు బరువు తగ్గడం ఎందుకు అంటారు. నిజానికి సన్నగా వున్నా లావుగా వున్నా వ్యాయామం అవసరమే. వ్యయామం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. అలాగే నిపుణుల పర్యవేక్షణ లో వ్యయామం చేస్తుంటే వారి సలహా మేరకు ఆహారం వుంటుంది. అలా కాకుండా ఎంత వ్యయామం చేస్తున్నా శరీరం కోరుకున్న దానికంటే ఎక్కువ ఆహారం తీసుకోదు.బరువు పెరిగేది ఆహారం వల్లనే అలాగే నెలసరి సమయంలో రకరకాల నొప్పులు, చిరాకులు వుంటాయి. కనుక వ్యయామం చేయకూడదు అనుకుంటారు. కానీ ఆ చిరాకు నుంచి బయట పడేసేది వ్యయామమె. కాకపోతే శరీరం మరీ అలసి పోకుండా కొద్ది పాటి దూరం నడవడం, ధ్యానం చేయొచ్చు. అలాగే ఎక్కువెక్కువ బరువులు మోస్తే బరువు తగ్గుతాననుకోవడం ప్రమాదం. శరీరానికి ఎంత వరకు హాని కలగకుండా అంత మాత్రం బరువులు వ్యయామం శిక్షకులు సుచిస్తారు. అంత బరువులు మాత్రమే మోయాలి. వ్యయామం, ఆహారం విషయంలో ఎక్క్కడో విన్న అపోహలన్ని నిపుణుల దగ్గర క్లారిఫై చేసుకోవడం ఎంతైనా మంచిది.

Leave a comment