మెరిసే రంగుల తాజా ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి ఫైటో కెమికల్స్ అందుతాయి. అంటారు పరిశోధకులు. ఏ ఆహరం అయితే ప్రపంచంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో తరతరాలుగా తీసుకుంటారని తెలుస్తుందో అది శక్తినిచ్చే ఆహారంగా గుర్తు పట్టమని కొందరంటారు. ఉదాహరణకు జనప గింజలు ఒమేగా 3,6,9 మొదలైన కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటాయి. గుడ్లు ప్రోటీన్స్, ఫ్యాటీ ఆమ్లం, విటమిన్స్, మినరల్స్ కలిగి వుంటాయి. రెడ్ వైన్ లో రేస్ వెలట్రోల్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వున్నాయి. ముదురు చాక్లెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ రక్తపోటును తగ్గిస్తుంది. బీన్స్ లోని ప్రోటీన్లు పీచు, బరువును నియంత్రిస్తాయి. బీట్ రూట్ లో ఫోలేట్, మాంగనీస్, పొటాషియం మొదలైన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వున్నాయి. వాల్ నట్స్ చెడు కొలెస్టరాల్ ను తగ్గిస్తాయి. వెల్లుల్లి చెడు కొవ్వు, రక్తపోటును తగ్గిస్తుంది. ఇక కొత్తిమీరలో ఎ విటమిన్ పుష్కలం. పావు కప్పు బత్తాయి రసంలో వుండే సి విటమిన్ ఇందులో దొరుకుతుంది. ఇవన్నీ శక్తి నిచ్చే బెస్ట్ ఫుడ్స్.

Leave a comment