అందమైన బ్యాగ్ కోసం షాపులన్నీ గాలించుకొంటాం కానీ ఆ బ్యాగ్ లో ఉంచుకోవలసిన లిప్ట్ ఎప్పుడైనా తయ్యారుచేసుకుని ఉంటారా. బయట అడుగు పెట్టిన క్షణం నుంచి ఎన్నో వస్తువుల అవసరం వుంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, లైనర్స్ లాంటి ఇతర కర్దులన్నీ పెట్టుకునే వాలెట్ విడిగా బ్యాజి లో వుండాలి. ఈ కార్డులు మిగితా వస్తువులు కలిసిపోకుండా వుండాలి. తలనొప్పి వోల్లునోప్పులు వంటి చిన్ని అనోగ్యాలకు పనికొచ్చే పెయిన్ కిల్లర్స్ తప్పని సరిగా ఉండాలి. అలాగే చిన్ని పెయిన్ కిల్లర్స్ తప్పని గా వుండాలి. అలాగే చిన్ని పెయిన్ బామ్ కూడా. ముఖ్యంగా సానిటరీ నాప్ కీన్ తప్పని  సరిగా వుంచుకోవలిసిన వస్తువుల్లో మొదటిది. మేకప్ కోసం ఉపయోగ పడే పౌడర్, కాజల్, టచప్ కు అవసరం పడే చిన్నపాటి వస్తువులు కూడా వుండాలి. ఒకటో రెండో చిట్కాలు పాకేట్స్ కూడా తప్పనిసరో. ఏ వర్షమో వచ్చి ఆగిపోతే రెడీ మేడ్ గా తినేందుకు కావాలి కదా. అలాగే పెద్ద నోట్ల తో పాటు తప్పనిసరిగా చిల్లర నోట్లు వుంచుకోవాలి. పెద్ద నోట్లు లేకపోయినా కార్డ్ వుంటుంది కానీ చిన్న నోట్లు చిల్లర కావాలి. చిన్ని పుస్తకం, రైటింగ్ పాడ్ లేకపోతే రెండు వైట్ పేపర్స్, పెన్ను వుంచుకోవాలి. ఏదైనా నోట్ చేసుకోవాలంటే అవసరమది. ఇప్పుడిక వర్షాలు స్టార్ట్ అయ్యాయికదా. ఓ చిన్ని గొడుగు మరచిపోకుండా బ్యాగ్లో వుంచుకుంటే ఇక రోజంతా నిస్ప్రుచిగా గడిపేయచ్చు.

Leave a comment