నీహారికా,

ఈ రోజు ఒక సెలబ్రెటీ ఇంట విందుకు వెళ్ళాను. ఎన్ని రకాల ఆహార  పదార్ధాలు, వందల్లో అనట్లేమో. స్వీట్లు, హాట్లు, ప్రాంతీయపరంగా అక్కడ ప్రసిద్ధి కెక్కిన ఐటమ్స్ వరసల వారీగా ఉన్నాయి. పైగా పెళ్లి సుభాలేఖ తో పాటు కొన్ని స్టాల్స్ నంబర్స్, ఏ స్టాల్లో ఏ భోజనం దొరుకుతుందో లిస్టు ఇచ్చారు. తిన్నంత తిని పారేసినంత పారేసినట్లు అన్నమా. ఏ మనిషి అయినా ఎన్ని రకాల భిజనం తినగలం ఎంత వృధా అవ్వుతుందో ఆహారం ఇలాంటి విందులకు హాజరు అయ్యాక మనసు క్షోభతో కొట్టుకు పోతుంది. ఎంతో మందికి భోజన దొరుకదు. గంటల కొద్దీ శ్రమ పడితే చేతిలో పడే డబ్బు ఒక్క పూత తిండికి సరిపోదు. ఇంకో చోట వృధాగా అన్తులేనంత ఆహారం ఈ తప్పు ఎవరిదీ? మన ఎంత స్ధితిమంతులమో చూపించుకునేందుకు చేసే అట్టహాసపు ప్రదర్శనలు ఆపేయడం ఎలా? ఒక్కటే సమాధానం. ఎవరికీ వాళ్ళు ఆలోచించుకుంటేనే. ఎవరికీ వాళ్ళు సాటి మనిషి గురించి ఆలోచిస్తేనే. ఎవరికీ వాళ్ళు బాధ్యత ఫీలయితేనే ఏ దుబారా అయినా ఆగుతుంది. అంతవరకూ ఈ పారంపర్ కొనసాగుతూనే వుంటుంది.

Leave a comment