ఏ సినిమాలోనో , ఏ మ్యాగ్ జైన్ కవర్ పేజ్ పైనో చూసి ఒక సినీ యాక్టర్ వేసుకున్న డ్రెస్ నో, ఏ మోడల్ ధరించిన నగనో చూసి మోజు పడిపోతారు. కాని అందరికి ఒకే రకమైన శరీరాకృతి ఉండదు, ఒకళ్ళకు నచ్చినట్లు ఇంకొకళ్ళకు బావుండవు. శరీరపు రంగు, ఎత్తు,బరువు ఎన్నో తేడాలుంటాయి. అందుకే ఎవరికి నప్పే దుస్తులు వాళ్ళు ఎంపిక చేసుకొవాలి. సన్నగా,పొడుగ్గా ఉంటే అన్ని రకాల వస్త్రశ్రేణి నప్పుతుంది. ఇవి సాదాగా ఉంటే ఇంకా పొడుగ్గా కనిపిస్తారు. పొడవాటి మాక్సీలు చక్కగా నప్పుతాయి చీరెలు బావుంటాయి కాని చీరె కుచ్చిలు, ఎంచుకునె రంగులు మ్యాచింగ్ గా వేసుకునే నగలు కొత్తగా కనిపించేలా శ్రద్ద తీసుకొవాలి. లావుగా పొట్టిగా ఉంటే వంటికి అతుక్కుపోయే దుస్తులను ఎంచుకోకపోవటం మంచిది. బోట్ నెక్ తరహా, బుజాలు విశాలంగా కనిపించేలా డిజైన్ లు ఎంచుకొవాలి. విశాలమైన బుజాలను కాలర్ నెక్, హై నెక్, బోట్ నెక్ వంటివి చాలా బావుంటాయి.

Leave a comment