మేకప్ సామగ్రి మాత్రం ఇచ్చి పుచ్చుకో కండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ఐలాష్,లైనర్ లాంటివి ఎవరివి వాళ్ళే ఉపయోగించాలి . బ్రష్ లు స్పాంజ్ పైన బాక్టీరియా పేరుకొంటుంది . వీటిని ఇతరులకు ఇచ్చిన,లేదా ఇతరులవి వాడినా ఇద్దరికీ ఇన్పెక్షన్ తప్పవు . లిప్ స్టిక్ లు ,లిప్ బామ్ లు కూడా ఒకరివి ఒకరు తీసుకోవటం ప్రమాదం . హానికారక బాక్టీరియా ఒకరి నుండి ఇంకోళ్ళకి సంక్రమిస్తుంది . మస్కరా కళ్ళ కలకలు,కళ్ళ ఇన్పెక్షన్లు తీసుకొస్తుంది . కంటికి ఏ ఇన్పెక్షన్ అయినా త్వరగా పాకే ప్రమాదం ఉంటుంది . ఇతరులు వాడిన మస్కారా ను వాడవద్దు . ముఖ్యంగా దువ్వెనలతో మరీ ప్రమాదం చుండ్రు,ఇన్పెక్షన్లు ఈ దువ్వెనల ద్వారానే అంటుకొంటాయి . ఇలాటివి ఇతరులతో పంచుకో కుండా ఉండటమే ఆరోగ్యం .

Leave a comment