పింగాణీ వస్తువులు శుభ్రం చేయటం తేలిక. పైగా పెద్ద ఖరీదు ఉండవు.ఇంట్లో వాడుకొనికి అవసరమయ్యే అన్ని వస్తువుల పింగాణీ లో లభిస్తున్నాయి,ఇవి మన్నికగా ఉండాలంటే ఇలా శుభ్రం చేయాలి.రెండు స్పూన్ల వంటసోడా లో ఓ స్పూన్ వెనిగర్, రెండు చుక్కలు డిష్ వాష్ లిక్విడ్ కలిపి కాఫీ కప్పులు,  పింగాణి ప్లేట్లు రుద్దితే మరకలు లేకుండా కొత్తవి లాగా మెరిసిపోతాయి.ప్లాస్టిక్ కంటైనర్ల కంటే పింగాణీ పాత్రలు వాడటం ఎంతో ఆరోగ్యం. ఇవి వేడిని ఎక్కువగా తట్టుకుంటాయి. ఆహారం ఇందులో ఉంచటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు.

Leave a comment