తేనె, నిమ్మరసం లాగే శరీరంలో వ్యర్దాలు పోగొట్టే అనేక పానీయాలు వున్నాయి. కాలుష్యం తో శరీరంలో వ్యర్ధాలు పేరుకుని అవే బరువు పెంచేందుకు కారణం అవ్వుతున్నాయి. కొన్ని రకాల పానీయాలతో వ్యర్ధాలు పోతాయి. పచ్చి అవిసె గింజల పొడిని, గోరువెచ్చని నీళ్ళలో ఓ చెంచా కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తంది. ఓ అల్లం ముక్క, యాపిల్ ముక్కలు, వేసి వుంచి ఆ నీటిని దాహం వేసినప్పుడల్లా తాగచ్చు. ఒక క్యారెట్ , ఓ స్పూన్ కొబ్బరి నూనె కలిపి గ్రయిండ్ చేసి గ్లాస్ నీళ్ళలో కలిపి ఆ నీటిని తాగితే కుడా ఇదే ఫలితం వుంటుంది. మంచినీళ్ళ సీసాలు, యాపిల్ సైడర్ వెనిగర్, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి వేసి ఆ నీళ్ళను తాగితే మంచిది.

Leave a comment