ప్రతి రోజు చేయ వలసిన పనుల్లో ఎదో ఒక సమస్య తో వత్తిడి వేదిస్తుంది. చిన్ని చిన్ని చర్యల తో వత్తిని ఇట్టే తగ్గించ వచ్చు. కామెడీ  కార్యక్రమాలు చూసినా, స్నేహితులతో సరదాగా గడిపినా, కామిక్ పుస్తకాలు చదివినా వత్తిడి తగ్గించుకోవచ్చు. మనస్పూర్తిగా నవ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఇష్ట పడే వారితో కొంత సమయం గడపడం వల్ల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులనైనా, మిత్రులనైనా లంచ్ కొ డిన్నర్ కొ ఆహ్వానింమో లేదా వారింటికి వేళ్ళటమో చేస్తూ వుండాలి. దీని వల్ల బాగా రిలాక్స్ అవ్వుతారు. ఒత్తిడి ఆనవాళ్ళు వుండవు. అంతే కాదు అనవసరమైన ఆందోళన వల్ల మెదడు పై భారం పడటం తగ్గిపోతుంది. ఇష్టమైన పాటలు విన్నా వత్తిడి వేదించదు. పార్క్ లో ఓ పది నిమిషాలు నడక ఎంతో ప్రశాంత ఇస్తుంది. కుదరక పొతే ఆఫీస్ లో నైనా అటు ఇటు తిరగవచ్చు. మెట్లెక్కి దిగవచ్చు. దీని వల్ల మానసిక ప్రశాంతత లభించి మెంటల్ టెన్షన్ తగ్గిపోతుంది. ప్రాణాయామం అత్యంత ప్రభావవంతమైన ఎక్సర్ సైజ్ యాంగ్జయిటీ తగ్గిపోతుంది.

Leave a comment