ఒక మనిషి గురించి తెలియకుండా ,ఒక్కసారి కూడా కలుసుకొకుండా .ఈ ఆన్ లైన్ లేమిటో నాకు అర్ధం కాదు అంటోంది కంగనా రనౌత్. అసలు లవ్ ఎట్ సైట్ కాన్సెప్టే నాకు తమషాగా అనిపిస్తుంది. అలాంటిది మన రిలేషన్స్ పైనా కూడా ఇంటర్ నెట్ ప్రభావం చూపించటం నాకు చాలా బాధ అనిపిస్తుంది. మనం రోబోల్లా అసలు ఏ స్పందన లేకుండా అయిపోతామో ఏమో . మెషీన్స్ లా అయిపోతామని నాకు చాలా భయం వేస్తుంది అంటోంది. కంగనా రనౌత్ .నాకు మాటుకు నేను జీవితంలో ఏం జరిగినా అంతా మంచికే అనుకొంటాను .నేను పెళ్ళీ చేసుకుందాం అనుకొన్నప్పుడు ఏదో కారణంతో అది జరగలేదు. అది కూడా నా మంచికే అనుకొంటా. అలాటప్పుడు ఈ ఆన్ లైన్ ప్రేమలు ప్రమాదం అని నాకు అనిపించటంలో వింత ఏముంది అంటుంది కంగనా రనౌత్.

Leave a comment