ఇప్పుడు లాంగ్ కుర్తీ ల హావా నడుస్తోంది . సాధారణంగా సింథటిక్ ,సిల్క్ మెటీరియల్ లో ఈ లాంగ్ కుర్తీ లు డిజైన్ చేస్తారు . బ్లాక్ పెయింట్స్,కలంకారీ ఏ డిజైన్ అయినా కాటన్ తో కుట్టిన లాంగ్ కుర్తీలు ఇంకాస్త అందంగా ఉంటున్నాయి . పై జాకెట్ వరకు సాదాగా ,చుడిదార్ మోడల్ లోనూ ,నడుం కిందినుంచి చక్కని కుచ్చులతో లాంగ్ కుర్తీలు చాలా కంఫర్టుబుల్ గా ఉంటాయి . కాస్త మెరిసే బీడ్స్ ఎంబ్రాయిడరీ కలిపితే ఇంకాస్త ఆకర్షణీయంగా ఉంటాయి . ఈవెనింగ్ పార్టీలకు నగలు లేకుండా చెవులకు వేలాడే బరువైన ఇయర్ రింగ్స్ తో ఈ లాంగ్ కుర్తీ చాలా బావుంటుంది .

Leave a comment