పొడవాటి గౌన్ లు ఇప్పుడు ఫ్యాషన్ అంటారు ఎక్స్ పర్ట్ డిజైనర్స్. టాపేజ్ మొదలుకుని థర్టీ ప్లస్ వరకు గౌన్లు చక్కగా ఉంటాయి. మాములు పార్టీలో ఎసెమెట్రికల్, కోల్డ్ షోల్డర్, ఆఫ్ షొల్డర్ డిజైన్ లు ఎంచుకుంటే పెళ్లి,రిసెఫ్షన్ లాంటి గ్రాండ్ పార్టీలలో బొటొనెక్ ,రౌండ్ , హైనెక్ డిజైన్లు బావుంటాయి. ఈ లాంగ్ గౌన్లలో పెద్ద చాంద్ బాలీలు, చేతికో బ్రాస్ లెట్ ఉన్నా చాలు. వస్త్ర శ్రేణి విషయానికి వస్తే షిఫాన్, జార్జెట్, బెనారస్ ఏవయినా ప్రయత్నించవచ్చు. జర్దోసీ ఎంబ్రాయిడరీ వర్కులతో మాములు గౌన్ కు కూడా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్.

Leave a comment